Homeహైదరాబాద్latest Newsమహిళా కమిషన్‌ ముందుకు కేటీఆర్‌.. కార్యాలయం వద్ద ఉద్రిక్తత

మహిళా కమిషన్‌ ముందుకు కేటీఆర్‌.. కార్యాలయం వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్ లోని బుద్ధ భవన్‌కు మాజీ మంత్రి కేటీఆర్ చేరుకున్నారు. పోలీసులు కేటీఆర్‌ను మాత్రమే లోపలికి అనుమతించారు. బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు, నేతలను పోలీసులు అనుమతించకపోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళా కార్పొరేటర్లు నినాదాలు చేశారు. మరోవైపు కేటీఆర్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ.. మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత, నేతలు మహిళా కమిషన్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.

Recent

- Advertisment -spot_img