నేడు అసెంబ్లీలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రుణమాఫీపై సవాల్ విసిరారు. రాష్ట్రంలోని ఏ ఒక్క ఉర్లో అయినా 100 శాతం రుణమాఫీ అయిందని రుజువు చేస్తే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా.. కొండారెడ్డిపల్లి పోదామా కొడంగల్ పోదామా సిరిసిల్ల పోదామా..అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. రైతులకు ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ వాళ్లు ఎన్నికలకు ముందు అన్నారు..ఎన్నికల్లో గెలిచి ఏడాది అవుతున్నా ఇప్పటికీ రైతుబంధు లేదు రైతు భరోసా లేదు.. రైతుబంధు పథకాన్ని రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తర్వాత సాగు విస్తీర్ణం పెరిగింది అని అన్నారు. రైతుబంధు పథకం ద్వారా గత బిఆర్ఎస్ సర్కార్ హయాంలో దాదాపు రూ.73 వేల కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ చేశాం అని వెల్లడించారు. 2019-20లో సాగు విస్తీర్ణం 141 లక్షల ఎకరాలు, 2020-21లో సాగు విస్తీర్ణం 204 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగిందని కాంగ్రెస్ వాళ్లు ఇచ్చిన నివేదికల్లోనే ఉంది అని పేర్కొన్నారు. రైతుబంధుని బీజేపీ కాపీ కొట్టింది అని కేటీఆర్ ఆరోపించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టి బీజేపీ వాళ్లు పీఎం కిసాన్ పెట్టారు అని తెలిపారు. కానీ ఈ విషయాన్ని బీజేపీ బయట చెప్పుకోరు అని కేటీఆర్ అన్నారు.