HomeEnglishKTR: Congress conspiracy to stop 'Raitu Bandhu' KTR : ‘రైతు బంధు’ను...

KTR: Congress conspiracy to stop ‘Raitu Bandhu’ KTR : ‘రైతు బంధు’ను అడ్డుకొనేందుకు Congress​ కుట్ర

– హస్తం పార్టీ అన్నదాతలకు వ్యతిరేకం
– మంత్రి కేటీఆర్​ ట్వీట్​

ఇదేనిజం, హైదరాబాద్​: రైతుబంధును అడ్డుకొనేందుకు కాంగ్రెస్​ పార్టీ కుట్ర చేస్తోందని మంత్రి కేటీఆర్​ ట్వీట్​ చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు విరోధి పార్టీ అని ఆరోపించారు. ‘రైతుబంధు’ నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్‌ ఫిర్యాదు చేయడంపై మంత్రి కేటీఆర్​ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్​, ఇంటింటికి తాగునీరు అందించకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందేమోనని ప్రశ్నించారు. అన్నదాత పాలిట నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని ఇంకోసారి తేలిపోయిందన్నారు. అన్నదాతల పొట్టకొట్టే కాంగ్రెస్ కుతంత్రాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ రైతులు భరించారన్నారు. ‘రైతుబంధును ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ తోకలు కట్ చేయడం పక్కా. ఇప్పటికే నమ్మి ఓటేసిన పాపానికి కర్ణాటక రైతులను అరిగోస పెడుతున్నారు.’ అంటూ కేటీఆర్​ ట్వీట్​ చేశారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img