HomeతెలంగాణKTR : కాంగ్రెస్​వి అలవిగానీ హామీలు

KTR : కాంగ్రెస్​వి అలవిగానీ హామీలు

– అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో రుణమాఫీ ఎక్కడ?
– రేవంత్ రెడ్డి చెప్పిన ప్రతిమాటకు రికార్డ్​ ఉంది
– ఆయనను వదిలిపెట్టేది లేదు
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ఇదే నిజం, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి అలవిగానీ హామీలు ఇచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లడారు. రేవంత్ రెడ్డి చెప్పిన ప్రతీ మాటకు రికార్డ్ ఉందన్నారు. ఆయనను తామెందుకు వదిలిపెడతామన్నారు. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారని.. రాగానే పెన్షన్ నాలుగు వేలు ఇస్తామన్నారని.. పదిరోజులు ఆగండి 15వేలు రైతు భరోసా ఇస్తాం అన్నారని.. కాని ఇంకా ఇవ్వలేదని విమర్శించారు. మొదటి కేబినెట్‌లోనే ఆరు గ్యారంటీలకు చట్ట బద్దత కల్పిస్తామరన్నారని.. ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో రుణమాఫీ చేయడానికి ఎంత ఇబ్బంది పడ్డామో తమకు తెలుసన్నారు. కాంగ్రెస్ రుణమాఫీ ఎలా చేస్తుందో తాము కూడా చూస్తామన్నారు. ఎవరైనా అధికారంలోకి రాక ముందు ఆదాయ లెక్కలు చూసుకుంటారని.. కానీ వీళ్లు మాత్రం ఇప్పుడు లెక్కలు చూసుకుంటున్నారన్నారు. తాము చేసిన ప్రతీ అప్పుకు ఆడిట్ రిపోర్ట్ ఉందన్నారు. వారు చూసుకోక పోతే తమకేం సంబంధమని కేటీఆర్ పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img