Homeహైదరాబాద్latest NewsKTR : కాళేశ్వరాన్ని కూల్చే కుట్ర

KTR : కాళేశ్వరాన్ని కూల్చే కుట్ర

– మా మీద కోపం రైతుల మీద చూపించొద్దు
– మేడిగడ్డ కొట్టుకుపోవాలని కాంగ్రెస్​ చూస్తోంది
– తెలంగాణను మరోసారి ఎడారి చేస్తారా?
– మరమ్మతులు చేయడానికి ఇబ్బంది ఏంటి?
– బీఆర్ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టును కూల్చేందుకు కాంగ్రెస్​ పార్టీ కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​ ఆరోపించారు. బీఆర్ఎస్​ నేతలు మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరారు. అంతకుమందు కేటీఆర్​ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్​ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఫైర్​ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బాధ్యత మరచి కాంగ్రెస్‌ ప్రభుత్వం దుష్ట రాజకీయాలు చేస్తున్నదని కేటీఆర్‌ అన్నారు. ప్రజలకు కాళేశ్వరం గొప్పదనాన్ని వివరించడానికి, పంటలు ఎండిపోకుండా చూడటానికి, ఎండాకాలంలో ప్రజలు గొంతులు ఎండగా చూడటానికే తాము చలో మేడిగడ్డ పర్యటన చేపట్టామని తెలిపారు. తెలంగాణను మరోసారి ఎడారిగా మార్చొద్దంటూ హితవు పలికారు. తమ మీద కోపాన్ని రైతుల మీద చూపించొద్దన్నారు. ఎండుతున్న పంటలకు తక్షణమే నీరందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

రైతులను బలి పశువులను చేయొద్దని సూచించారు. రిపేర్‌ చేయకుంటే వర్షాకాలంలో బరేజ్‌ కొట్టుకుపోతుందని చూస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బాధ్యత మరచి కాంగ్రెస్‌ ప్రభుత్వం దుష్ట రాజకీయాలు చేస్తున్నదని కేటీఆర్‌ అన్నారు. ప్రజలకు కాళేశ్వరం గొప్పదనాన్ని వివరించడానికి, పంటలు ఎండిపోకుండా చూడటానికి, ఎండాకాలంలో ప్రజలు గొంతులు ఎండగా చూడటానికే తాము చలో మేడిగడ్డ పర్యటన చేపట్టామని తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకోండి. కానీ, రైతులను బలి చేయొద్దని సూచించారు. రిపేర్‌ చేయకుంటే వర్షాకాలంలో బరేజ్‌ కొట్టుకుపోతుందని చూస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ మినహా మిగతా ముఖ్య నేతలంతా తరలివెళ్లారు. తొలుత మేడిగడ్డను సందర్శించిన అనంతరం అన్నారం బ్యారేజీని పరిశీలించనున్నారు. అక్కడ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇవ్వనున్నారు. ‘తప్పు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోవాలని కుట్ర చేస్తున్నారు. వర్షాకాలం వచ్చేలోపు ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలి’ అన్నారు.

Recent

- Advertisment -spot_img