తెలంగాణలో ఒకేరోజు ఐదుగురు డెంగ్యూతో చనిపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫైరయ్యారు. రాష్ట్రంలో భారీగా కేసులు పెరుగుతున్నా వైద్యశాఖ పర్యవేక్షించట్లేదని విమర్శించారు. కేసుల పెరుగుదలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై శాఖ వద్ద ప్రణాళికలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, డెంగ్యూపై అవగాహన కల్పించాలని కోరారు. ముఖ్యంగా బ్లడ్ ప్లేట్లెట్స్ అందుబాటులో ఉంచాలని సూచించారు.