Homeహైదరాబాద్latest Newsకేటీఆర్‌కు హైకోర్టులో ఊరట.. అప్పటి వరకు జన్వాడ ఫామ్‌హౌస్‌ను కూల్చొద్దంటూ హైకోర్టు ఆదేశం..!

కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట.. అప్పటి వరకు జన్వాడ ఫామ్‌హౌస్‌ను కూల్చొద్దంటూ హైకోర్టు ఆదేశం..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. జన్వాడ ఫామ్‌హౌస్‌ను కూల్చొద్దంటూ కేటీఆర్ అనుచరుడు ప్రదీప్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ క్రమంలోనే హైడ్రాపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. హైడ్రాకు ఉన్న లీగల్ స్టేటస్, హైడ్రా విధివిధానాలు ఏంటని ప్రశ్నించింది. అలాగే రేపటి వరకు కూల్చివేతలు చేపట్టొద్దని హైడ్రాకు కోర్టు ఆదేశించింది. అయితే 111 నిబంధనలకు విరుద్ధంగా జన్వాడ ఫామ్‌హౌస్‌ను నిర్మించారంటూ.. దానిని కూల్చేందుకు హైడ్రా సిద్ధమైన విషయం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img