బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేశారు. ఈ రోజు ఓపెన్ గా చెబుతున్నా.. సమంత, నాగచైతన్యల విడిపోవడానికి కారణం కూడా కేటీఆరే. నాపై చేసిన అనుచిత పోస్టులపై మనసున్న మనిషిగా హరీశ్ రావు స్పందించారు. కేటీఆర్ కి ఏమైంది? ఎందుకు స్పందించలే’ అని ప్రశ్నించారు.