Homeహైదరాబాద్latest NewsKTR : HCU విద్యార్థులతో కేటీఆర్ భేటీ.. భూముల ఇష్యూపై చర్చ

KTR : HCU విద్యార్థులతో కేటీఆర్ భేటీ.. భూముల ఇష్యూపై చర్చ

KTR : HCU వివాదం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. యూనివర్సిటీ క్యాంపస్‌లోని భూముల వేలం వివాదం కొనసాగుతోంది. స్టేట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు 400 ఎకరాలు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు 30 జేసీబీలతో HCUలోని చెట్లును తొలగించింది. అయితే హెచ్‌సీయూ మెయిన్‌ గేట్‌ వద్ద విద్యార్థులు మరోసారి ఆందోళనకు దిగారు. తాజాగా తెలంగాణ భవన్‌లో HCU విద్యార్థులతో కేటీఆర్ (KTR) సమావేశం అయ్యారు. ఈ క్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. మాకు జరుగుతున్న ఈ అన్యాయం మీకు కనపడం లేదా అని HCUలో నెమళ్లు, పక్షులు కేకలు పెడుతున్నాయి.. అవి మీకు వినపడట్లేదా రాహుల్ గాంధీ గారు అని కేటీఆర్ ప్రశ్నించారు. కోర్టుకు సెలవలు అని తెలిసి వందల సంఖ్యలో మెషిన్లు, పోలీసులని పెట్టి.. అడ్డం వచ్చిన పిల్లలను ఇష్టం వచ్చినట్టు కొట్టి, ఆడపిల్లలు అని చూడకుండా బట్టలు చింపి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరాచకం చేస్తుంది అని మండిపడ్డారు. పశ్చిమ హైదరాబాద్ కు ఆక్సిజన్ అందించే విలువైన 400 ఎకరాల భూమిని ధ్వంసం చేస్తూ పచ్చి హత్యకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Recent

- Advertisment -spot_img