ktr : నల్గొండలో రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (ktr) చేపట్టబోయే రైతు మహాధర్నా వాయిదా పడింది. ఈ రైతు మహాధర్నాకు అనుమతి పోలీసులు నిరాకరించారు. పోలీసుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించి బీఆర్ఎస్ నేతలు లంచ్‌మోషన్ పిటిషన్ వేశారు. కోర్టు తీర్పు వచ్చే వరకు కేటీఆర్ రైతు మహాధర్నాను బీఆర్ఎస్ పార్టీ వాయిదా వేసింది. పోలీసుల అనుమతి విషయంలో ఇప్పుడే జోక్యం చేసుకోలేమని హైకోర్టు చెప్పింది. ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రామ సభల నేపథ్యంలో బందోబస్తు ఇవ్వలేమని తెలిపింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల లంచ్ మోషన్ పిటీషన్ 27కు హైకోర్టు వాయిదా వేసింది.