KTR : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ (KTR) ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. రాష్ట్రంలో ఏ ఒక్క ఊరిలో కూడా పూర్తిస్థాయిలో రుణమాఫీ కాలే, రైతు భరోసా రాలేదు, బోనస్ కు దిక్కు లేదు అని అన్నారు. రాష్ట్రంలో 25 నుంచి 30 శాతం రైతు రుణమాఫీ జరగలేదు అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గానికి వెళ్దామా రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్దాం.. నువ్వు నిరూపించుకో రేవంత్.. మేమంతా రాజీనామా చేస్తాం అని కేటీఆర్ సవాల్ విసిరారు. కేసీఆర్ మీదున్న గుడ్డి కోపంతో మేడిగడ్డను రిపేర్ చేయడం లేదు అలాగే వ్యవసాయాన్ని కూడా రేవంత్ ఆగం చేసాడు అని కేటీఆర్ ఆరోపించారు. కానీ గవర్నర్ రుణమాఫీ జరిగిందని అబద్ధాలు గవర్నర్ చేత చెప్పించారు అని అన్నారు.
గవర్నర్ ప్రసంగంలో ఏదైనా కొత్త విషయాలు చెప్తారు అనుకున్నాం కానీ ఏమి చెప్పలేదు. ప్రజలకు ఇచ్చిన 420 హామీలపై మాట్లాడుతారు అనుకున్నాం.. అట్టర్ ప్లాప్ హామీల గురించి మాట్లాడుతారు అని అనుకున్నాం కానీ గవర్నర్ ప్రసంగం గాంధీభవన్లో పార్టీ కార్యకర్తలు లాగా మాట్లాడినట్టుగా ఉంది అని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ ఘోర వైఫల్యం వల్ల రాష్ట్ర రైతాంగం ఆందోళనలో ఉంది అని అన్నారు. పంటలు ఎండిపోతున్నాయి.. 480 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతులకు భరోసానిచ్చే మాట ఉపశమనం ఇచ్చే మాట ఏ ఒక్కటి కూడా ఈ ప్రసంగంలో చేయలేదు.. బుద్ధి తెచ్చుకున్నమని బుద్ధితో మెదులుతామని ఒక మాట అయినా చెప్తారేమో అనుకున్నాం అని అది జరగలేదు. అలాగే బీసీల సంఖ్య ఎందుకు తగ్గించారని అడిగితే ఎమ్మెల్సీ మల్లన్నను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేశారు అని పేర్కొన్నారు. బీసీలను కులగణన పేరుతో వంచించి, అవమానించారు అని అన్నందుకు సస్పెండ్ చేశారు అని కేటీఆర్ ప్రశ్నించారు. దావోస్ పర్యటనలు లక్ష డెబ్బై మూడు వేల కోట్లు వచ్చాయని గవర్నర్ ప్రసంగంలో చెప్పించారు అని అన్నారు. కానీ తెలంగాణకు 75 పైసలు కూడా పెట్టుబడులు రాలేదు అని ఆరోప[యించారు. తెలంగాణ నుంచి ప్రముఖ కంపెనీలను కూడా వెళ్ళిపోతున్నాయి అని కేటీఆర్ వెల్లడించారు.