HomeతెలంగాణKTR : కంటోన్మెంటుకు కరెంటు, నీళ్లు బంద్‌ చేస్తాం

KTR : కంటోన్మెంటుకు కరెంటు, నీళ్లు బంద్‌ చేస్తాం

KTR : కంటోన్మెంటుకు కరెంటు, నీళ్లు బంద్‌ చేస్తాం

KTR : కంటోన్మెంట్‌ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించకుండా.. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా ఇష్టం వచ్చినట్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమయితే దానికి మంచినీళ్లు, కరెంటు బంద్‌ చేస్తామని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు రాష్ట్ర శాసనసభలో హెచ్చరించారు.

ప్రశ్నోత్తరాల సందర్భంగా కార్వాన్‌ నియోజకవర్గంలో నెలకొన్న నాలాల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే కౌసర్‌ మొహియుద్దీన్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్‌ సమాధానమిచ్చారు.

”కంటోన్మెంట్‌ అధికారులు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లలో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. కార్వాన్‌ వద్ద చెక్‌ డ్యాం కట్టి నీళ్లు ఆపడంతో నదీం కాలనీ మునిగిపోతోంది.

శాతం చెరువు నుంచి గోల్కొండ కిందకు నీళ్లు వదులుదామంటే ఏఎస్‌ఐ అనుమతి ఇవ్వడం లేదు.

ఇలా కంటోన్మెంట్‌, ఏఎస్‌ఐ అభివృద్ధికి అడ్డు పడుతున్నాయి. ఇది మంచి పద్ధతి కాదు.. కంటోన్మెంట్‌ అధికారులను తక్షణమే పిలిచి మాట్లాడాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తాం.

ఒకవేళ వారు వినకపోతే తీవ్ర చర్యలు తీసుకుంటాం. ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే రోడ్లు బంద్‌ చేస్తాం.. నాలాల మీద చెక్‌ డ్యాంలు కడుతామంటే చూస్తూ ఊరుకోం, అవసరమైతే కంటోన్మెంట్‌కు మంచినీళ్లు, కరెంట్‌ బంద్‌ చేస్తాం. అప్పుడైనా దిగిరావాల్సిందేనని మంత్రి అన్నారు.

Before Death : మ‌నిషి చ‌నిపోవ‌డానికి ముందు ఏమౌతుంది

Egg Quality test : గుడ్డు తాజాద‌నాన్నిక‌నిపెట్టేందుకు సింపుల్ ట్రిక్స్..

కిషన్‌రెడ్డి కేంద్రమంత్రిగా ఉండటం మన దురదృష్టం

కేంద్రం తెలంగాణకు చేసిందేమీ లేదని, 18 నెలల క్రితం వరదల సమయంలో కేంద్ర మంత్రులు వచ్చి ఫొటోలు దిగి వెళ్లిపోయారే తప్ప నయా పైసా సాయం అందించలేదని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు.

అదే గుజరాత్‌లో వరదలు వస్తే ప్రధాని మోదీ స్వయంగా అక్కడికి వెళ్లి రూ. 1000 కోట్లు ఇచ్చారని అన్నారు.

హైదరాబాద్‌ అభివృద్ధిలో కేంద్రం వాటా శూన్యమని ఆరోపించారు. తెలంగాణ వేరే దేశమైనట్టు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

కేంద్రం అనుసరిస్తున్న తీరు సిగ్గుచేటన్నారు. వ్యూహాత్మక రోడ్లు, నాలాల అభివృద్ధి కార్యక్రమంపై శాసనసభలో సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు.

”హైదరాబాద్‌కు సాయమడిగితే కేంద్ర పెద్దలు అమృత్‌లో చేరమన్నారు. లక్షకు పైగా జనాభా ఉన్న నగరాలు అమృత్‌లో చేరాలని చెప్పారు.

నగరంలో కోటికి పైగా జనం నివసిస్తున్నారు. కేంద్రమిచ్చే రూ.200-300 కోట్లు ఏ మూలకు సరిపోతాయి? కంటోన్మెంట్‌లోని మిలటరీ ప్రాంతాల్లో కేంద్రం తీరు సరిగా లేదు.

ఎన్ని సార్లు చెప్పినా వినిపించుకోవడం లేదు. కేంద్రం సాయం చేయదు.. పనిచేసే వారికి మాత్రం అడ్డంకులు సృష్టిస్తుంది.

Clean Kidneys : కిడ్నీల‌ను ఇలా శుభ్రం చేసుకోండి..

Chicken : చికెన్‌ను స్కిన్‌తో తింటే మంచిదా.. కాదా..

హైదరాబాద్‌కు చెందిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి కూడా సాయం చేయడానికి మనసు రావడం లేదు. ఆయన కేంద్రమంత్రిగా ఉండటం మన దురదృష్టం” అని వ్యాఖ్యానించారు.

గతంలో వరదలతో నగర వాసులు చాలా ఇబ్బందులు పడ్డారు. వచ్చే వర్షాకాలంలో ఇలాంటి ఇబ్బందులు పునరావృతం కావద్దు.

వర్షాకాలం వచ్చేలోపు నాలాల పనులు పూర్తయ్యేలా పర్యవేక్షిస్తున్నాం. నాలాల సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతాం” అని తెలిపారు.

వంద శాతం మురుగునీటి శుద్ధికి రూ.3,866 కోట్లు

”కాంగ్రెస్‌ హయాంలో కలుషిత నీటితో భోలక్‌పూర్‌లో 11 మంది మృతిచెందారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తెలంగాణ సర్కారు చర్యలు చేపట్టింది.

మురుగు, మంచినీరు కలవకుండా పక్కాగా ప్రణాళికలు రూపొందించింది. భాగ్యనగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు శ్రమిస్తున్నాం.

హైదరాబాద్‌లో రూ.3,866 కోట్లతో వంద శాతం మురుగునీటి శుద్ధి ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే డిసెంబర్‌ నాటికి పనులన్నీ పూర్తవుతాయి” అని కేటీఆర్‌ తెలిపారు.

Best Diet : మ‌ంచి డైట్ కావాలా.. ఇదిగో ఇదేనంట ప్ర‌పంచంలో మంచి డైట్‌

Be Active : ఇలా చేస్తే యాక్టివ్‌గా ఉంటారు

Recent

- Advertisment -spot_img