HomeతెలంగాణKTR : పట్వారీ వ్యవస్థ అంటేనే దళారీ వ్యవస్థ

KTR : పట్వారీ వ్యవస్థ అంటేనే దళారీ వ్యవస్థ

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే ధ‌ర‌ణిని ఎత్తేసి, ప‌ట్వారీ వ్య‌వ‌స్థ‌ను తీసుకొస్తామని చెబుతున్నారని.. పట్వారీ వ్యవస్థ అంటేనే దళారులు ఉంటారని మంత్రి కేటీఆర్ తెలిపారు.‘గ‌తంలో తెలంగాణ‌లో ఒక రైతు భూమి రిజిస్ట్రేష‌న్​ కావాలంటే చేయి తడపాల్సిందే. అంతేకాదు ఎప్పుడు రిజిస్ట్రేష‌న్ అవుత‌దో, మ్యుటేష‌న్ ఎప్పుడు అయిత‌దో తెల‌వ‌ని ప‌రిస్థితి. మ‌న చేతుల్లో ఏం ఉండేది కాదు. వాళ్ల ద‌య.. మ‌న ప్రాప్తం. ధ‌ర‌ణి వ‌చ్చిన త‌ర్వాత అన్నిలేయ‌ర్స్ పోయాయి. వీఆర్వో, వీఆర్ఏ, ఎమ్మార్వో, ఆర్డీవో, జాయింట్ క‌లెక్ట‌ర్, క‌లెక్ట‌ర్, సీసీఎల్ఏ, రెవెన్యూ సెక్ర‌ట‌రీ, రెవెన్యూ మినిస్ట‌ర్ ఇలా 8 లేయ‌ర్స్ తీసేశాం. ధ‌ర‌ణి ద్వారా రైతుల వేలి ముద్ర‌కు అధికారం ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మీ భూమి రికార్డును ఎవ‌రూ ట్యాంప‌ర్ చేయ‌కుండా మీకు అధికారం ఇచ్చారు. ధ‌ర‌ణి తీసుకొచ్చింది కేసీఆర్. అందులోలో లోటుపాట్లు ఉండొచ్చు. మేం లేవు అన‌ట్లేదు. కానీ ఇవాళ భూమాత అని తెస్తున్నారు. తిరిగి ప‌ట్వారీ వ్య‌వ‌స్థ‌ను తీసుకొస్తామ‌ని చెబుతున్నారు. ప‌ట్వారీ వ్య‌వ‌స్థ అంటేనే ద‌ళారీ వ్య‌వ‌స్థ‌. ప‌ట్వారీ వ్య‌వ‌స్థ‌ను తీసుకొచ్చిన వారిని ఆశీర్వ‌దిద్దామా.? లేదా ధ‌ర‌ణి తెచ్చి, భూముల రిజిస్ట్రేష‌న్‌లో పార‌ద‌ర్శ‌క‌త తెచ్చిన వారిని ఆశీర్వ‌దిద్దామా అని జనం ఆలోచించాలి’ అని కేటీఆర్ తెలిపారు.

Recent

- Advertisment -spot_img