Homeహైదరాబాద్latest Newsకేటీఆర్ రిప్లై టు రేవంత్

కేటీఆర్ రిప్లై టు రేవంత్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్ రిప్లై ఇచ్చారు. మహిళలకు నెలకు రూ.2500 ఎక్కడ ఇస్తున్నారో చెప్పాలన్నారు. ‘నువ్వు చీర కట్టుకుంటావా..లేక రాహుల్‌కు కట్టిస్తావా?’ అని X వేదికగా విమర్శించారు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్న కాంగ్రెస్‌ను బొందపెట్టేది ఆడబిడ్డలేనని వ్యాఖ్యానించారు. ఫ్రీ బస్ స్కీంలో ప్రయాణికులకు సీట్లు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని..ముష్టి యుద్ధాలు చేసే దారుణ పరిస్థితిని తీసుకొచ్చిన ఈ చేతగాని ప్రభుత్వాన్ని ప్రజలే నేలమట్టం చేస్తారని దుయ్యబట్టారు. చిల్లర మాటలు, ఉద్దెర పనులు తప్ప ఈ ప్రభుత్వం చేసేదేమీ లేదని ఘాటుగా స్పందించారు.

Recent

- Advertisment -spot_img