ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: లండన్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ఆయన హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల నేతలతో లోక్ సభ సమావేశాల్లో భాగంగా తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. “రేవంత్ వంటి వారిని భారాస తన ప్రస్థానంలో ఎంతో మందిని చూసింది. 25 ఏళ్లుగా నిలబడి అలాంటి ఎందరినో మట్టికరిపించింది. ముందు 100 రోజుల్లో నెరవేరుస్తామన్న హామీలను నెరవేర్చండి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఏక్నాథ్ శిందేగా మారుతారు. అదానీ-రేవంత్ ఒప్పందాల అసలు లోగుట్టు బయటపెట్టాలి. లోక్ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, భాజపా కలిసిపోతాయి. ఆయన రక్తమంతా భాజపాదే. జనవరి నెల కరెంటు బిల్లులను ప్రజలెవరూ చెల్లించవద్దు. కరెంటు బిల్లులను సోనియా గాంధీ ఇంటికి పంపాలి. ప్రతి మహిళకు నెలకు రూ.2,500ను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి. హామీలు అమలు చేయకుంటే వదిలి పెట్టేది లేదు. 50 రోజుల పాలనలో ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు” అని అన్నారు.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ..”శాసనసభ ఎన్నికలపై సమీక్షించడంతోపాటు సార్వత్రిక ఎన్నికల కార్యాచరణపై చర్చించారు. నేతల నుంచి అభిప్రాయాలు, సూచనలను స్వీకరించారు.”