HomeతెలంగాణKTR : Schemes under BRS Scams under Congress rule KTR : BRS...

KTR : Schemes under BRS Scams under Congress rule KTR : BRS కింద పథకాలు కాంగ్రెస్ పాలనలో మోసాలు

  • కాంగ్రెస్ గెలిస్తే కరెంటు వచ్చేది మూడు గంటలే..
  • ఐసీయూలో హస్తం పార్టీ
  • కాంగ్రెస్ గెలిస్తే నల్లా నీళ్లు కూడా రావు
  • మోడీకి తెలంగాణ మీద ఎందుకింత కక్ష
  • నిరంజన్ రెడ్డి కేసీఆర్ కుడి భుజం
  • తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు
  • ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్

ఇదేనిజం, వనపర్తి: బీఆర్ఎస్ పాలనలో స్కీములు తీసుకొస్తే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం స్కాములు చేసిందని ఐటీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వస్తే కేవలం మూడు గంటల పాటు మాత్రమే కరెంట్ వస్తుందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ నేతలే ఆ విషయం ఒప్పుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కన్నీళ్లు మిగులుతాయని.. బీఆర్ఎస్ పాలనలో మాత్రం సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని చెప్పారు. వ‌న‌ప‌ర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వనపర్తి పదేళ్ల ప్రగతి మహాసభలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.కాంగ్రెస్ పార్టీవి వారంటీ లేని గ్యారంటీలు అని, ఆ పార్టీ ఐసీయూలో ఉన్న‌ద‌ని విమ‌ర్శించారు. కాంగ్రెస్ పార్టీ అంటే మైగ్రేష‌న్, బీఆర్ఎస్ అంటే ఇరిగేష‌న్ అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను నమ్ముకుంటే 24 గంటల కరెంటు పోయి.. మూడు గంటల కరెంట్ రావ‌డం ఖాయ‌మ‌న్నారు. నల్లా నీళ్లు కూడా బంద్ అవుతాయి.. ఆ నీళ్ల కోసం ఎదురుచూడాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంద‌న్నారు.పాలమూరుకు వస్తున్న మోదీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయహోదా ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కృష్ణా జ‌లాల్లో తెలంగాణ‌కు న్యాయంగా రావాల్సిన 575 టీఎంసీల‌ను కేటాయించాల‌న్నారు. మోడీకి తెలంగాణ అంటే ఎందుకింత క‌క్ష అని ప్ర‌శ్నించారు. వాల్మీకీ బోయలకు ఎస్టీ హోదా కోసం రెండుసార్లు తీర్మానం పంపినా కేంద్రం పట్టించుకోలేద‌ని మండిప‌డ్డారు.

దత్తత తీసుకొన్నోళ్లు దగా చేశారు
కొంతమంది లీడర్లు పాలమూరును దత్తత తీసుకొని కూడా దగా చేశారని కేటీఆర్ దుయ్యబట్టారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా.. మన ప్రమేయం ఉండాలని చెప్పారు. అప్పుడే హక్కులను సాధించుకోగలుగుతామన్నారు. కేంద్రంలో మన ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఏర్పడొద్దన్నారు. కేంద్రంలో మ‌నం ఉంటేనే మ‌న‌కు రావాల్సిన హ‌క్కులు వ‌స్తాయ‌న్నారు. గులాబీ జెండా ఎగిరే వరకు పాలమూరును పట్టించుకోలేదని విమర్శించారు. జిల్లా నుండి 14 లక్షల మంది వలసపోతుంటే ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. నది పక్కన నేలలున్నా ఏ ప్రభుత్వం కూడా నీళ్లివ్వలేదు. ఆర్డీఎస్ తూములు పగులగొట్టి నీళ్లు తీసుకుపోతున్నా పట్టించుకోలేదు. అక్రమంగా నీళ్లు తీసుకుపోతుంటే హారతులిచ్చి పంపించింది దగుల్బాజీ కాంగ్రెస్ నేతలే అని కేటీఆర్ మండిప‌డ్డారు.

నిరంజన్ రెడ్డి వల్లే వనపర్తికి నీళ్లు
వనపర్తికి సాగునీరు తీసుకొచ్చేందుకు మంత్రి నిరంజన్ రెడ్డి ఎంతో ప్రయత్నించారని కేటీఆర్ చెప్పారు. వనపర్తి నియోజ‌క‌వ‌ర్గంలో లక్షా 25 వేల ఎకరాలకు నీళ్లొచ్చాయంటే అది నిరంజన్ రెడ్డి వల్లే సాధ్యమైందన్నారు. వనపర్తికి మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలలు వచ్చాయని గర్వంగా గల్లా ఎగరేసి చెప్పొచ్చు. రూ. 180 కోట్లతో నూతన ఆసుపత్రిని నిర్మించారు. వనపర్తిని జిల్లా చేసి కలెక్టరేట్ నిర్మించారు. పీర్ల గుట్ట‌లో నిర్మించిన డ‌బుల్ బెడ్రూం ఇండ్లు బంజారాహిల్స్ ఇండ్ల మాదిరిగా ఉన్నాయి. ఐటీఐ, కేజీబీవీ, వ్యవసాయ డిగ్రీ కళాశాలల నిర్మాణం జ‌రుగుతుంది. ఇంటి పెద్దలా నిరంజన్ రెడ్డి వనపర్తిని అభివృద్ది చేస్తున్నారు. 65 ఏళ్లలో చేయని పనిని ఐదేళ్లలో చేసి చూపించారు. కేసీఆర్ కుడిభుజంగా తెలంగాణ జెండా ఎత్తి గ్రామగ్రామాన తెలంగాణ ఉద్యమాన్ని రగిలించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో పాలమూరు అభివృద్దికి నిరంతరం కృషిచేస్తున్నారు. సిరిసిల్ల, సిద్దిపేట మాదిరిగా అత్యధిక మెజారిటీతో నిరంజన్ రెడ్డిని మళ్లీ గెలిపించాల‌ని కేటీఆర్ కోరారు.

Recent

- Advertisment -spot_img