Homeహైదరాబాద్latest Newsకేటీఆర్ లీగల్ నోటీసులను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలి : మంత్రి బండి సంజయ్

కేటీఆర్ లీగల్ నోటీసులను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలి : మంత్రి బండి సంజయ్

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. కేసీఆర్ బూతు పురాణం కుటుంబమని అన్నారు. ఉదయం లేస్తే చాలు ఆ పార్టీ నేతలు అందరూ బూతులే మాట్లాడుతారన్నారు. వాళ్లు చేస్తే సంసారం ఎదుటివారు ఏం చేసినా వ్యభిచారం అంటారని వాపోయారు.కేసీఆర్ తిట్టినట్లు బూతులను ఎవరూ తిట్టలేదన్నారు. కేటీఆర్ కూడా తండ్రి లనే ప్రవర్తిస్తున్నారని అన్నారు.
కేటీఆర్ జారీ చేసిన లీగల్ నోటీసులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. లీగల్ నోటీసులో కేటీఆర్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని, నిరాధారమన్నారు. కేటీఆర్ తనకు ఇచ్చిన లీగల్ నోటీసులను ఉపసంహరించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని అన్నారు. లేనిపక్షంలో వారం రోజుల్లో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Recent

- Advertisment -spot_img