HomeరాజకీయాలుKTR : తుమ ఉమకు సముచిత స్థానం ఇచ్చి గౌరవించుకుంటాం

KTR : తుమ ఉమకు సముచిత స్థానం ఇచ్చి గౌరవించుకుంటాం

– మంత్రి కేటీఆర్
– బీజేపీకి రాజీనామ చేసి బీఆర్ఎస్​లో చేరిన తుల ఉమ


ఇదే నిజం, హైదరాబాద్: తుల ఉమకు బీజేపీ వేములవాడ టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి, గుంజుకోవడం చాలా బాధాకరమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇది మహిళలకే కాకుండా బీసీల విషయంలో బీజేపీ వ్యతిరేక వైఖరికి నిదర్శనమని విమర్శించారు. బలహీన వర్గాల ఆడబిడ్డకు ఇటువంటి అన్యాయం జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. తన అనుచరులతో కలిసి తుల ఉమ సోమవారం తిరిగి బీఆర్ఎస్​లో చేరారు. గత హోదాకంటే కూడా మరింత సముచిత హోదాను, బాధ్యతలను ఆమెకు అప్పగించి గౌరవించుకుంటామని ఈ సందర్భంగా కేటీఆర్‌ హామీ ఇచ్చారు. ‘తెలంగాణ ఉద్యమం నుంచి సీనియర్ మహిళా నాయకురాలిగా, నాడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలిగా పనిచేశారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు స్వయంగా నేనే ఉమక్కకు ఫోన్ చేసి పార్టీలోకి ఆహ్వానించా. నా ఆహ్వానాన్ని మన్నించి పార్టీలోకి రావడం సంతోషం. వేములవాడ నియోజకవర్గ అభివృద్ధితో పాటు రాష్ట్రంలోని మహిళా అభ్యున్నతి కోసం ఆమె సేవలు అవసరం’అని కేటీఆర్‌ తెలిపారు.


బీజేపీ నన్ను అవమానించింది: తుల ఉమ


బీఆర్ఎస్​లో చేరికకను ముందు తుల ఉమ మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి రాజీనామా లేఖను పంపినట్లు తెలిపారు. బీజేపీలో చేరినప్పటి నుంచి పార్టీ చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తనవంతు కృషి చేశానని, పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా తనకు వేములవాడ అసెంబ్లీ టికెట్‌ ఇచ్చారని, అయితే ఆఖరి నిమిషంలో వేరేవాళ్లకి బీఫామ్‌ ఇచ్చి తనను అవమానించారిన తుల ఉమ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. దీన్ని తన ఒక్కదానికి జరిగిన అవమానం కాదని, తన గొల్ల కురుమ జాతికి జరిగిన అవమానంగా భావిస్తున్నానని ఉమ తెలిపారు. బీసీ నాయకురాలికి టికెట్‌ ప్రకటించి బీఫామ్ ఇవ్వని మీరు.. బీసీ నినాదంతో ముందుకు పోతామనం విడ్డూరంగా ఉందని ఆమె రాజీనామా లేఖలో ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్​లో చేరిన అనంతరం తుల ఉమ మాట్లాడుతూ.. బీజేపీ కింది స్థాయి కార్యకర్తలను అవసరానికి వాడుకుంటుంది. బీఆర్ఎస్​లో మొదటి నుంచి ఉన్నాను. అనేక హోదాల్లో పని చేశా. ఇక్కడ దక్కిన గౌరవం బీజేపీలో ఇవ్వలేదు. ఇప్పుడు నా సొంత ఇంటికి మళ్లీ వచ్చినట్లు ఉంది’ అని తుల ఉమ తెలిపారు.

Recent

- Advertisment -spot_img