Homeతెలంగాణఅలా ప్ర‌చారం చేయ‌డం సిగ్గుచేటుః కేటీఆర్‌

అలా ప్ర‌చారం చేయ‌డం సిగ్గుచేటుః కేటీఆర్‌

హైదరాబాద్‌: కొవిడ్‌-19పై పోరాటం చేసేందుకు తెలంగాణ‌కు కేంద్రం రూ.7 వేల కోట్లు ఇచ్చిందని బీజేపీ ఎంపీలు ప్ర‌చారం చేస్తున్నార‌ని, కానీ కేవ‌లం రూ.290కోట్లు మాత్ర‌మే ఇచ్చినట్లు కేంద్రం లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చిందని మినిస్ట‌ర్‌ కేటీఆర్‌ అన్నారు. ఇందుకు సంబంధించిన పేపర్‌ క్లిప్‌లను కేటీఆర్‌ ట్విటర్‌లో పోస్టు చేశారు. అసత్యాలతో తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటని కేటీఆర్ అన్నారు.
మంచిదైతే ఆందోళ‌నెందుకు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు రైతులకు మేలు చేసేవీ అయితే ఎన్టీయే మిత్రపక్షాలు ఎందుకు దూరం అయ్యాయి.. దేశ వ్యాప్తంగా రైతులు ఎందుకు ఆందోళ‌న చేస్తున్నార‌ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. తెలంగాణ చట్టసభలు రెవెన్యూ బిల్లును ఆమోదిస్తే రాష్ట్రమంతా సంతోష వాతావ‌ర‌ణం ఉంద‌ని గుర్తు చేశారు. రెవ‌న్యూ బిల్లుపై రైతులోకం సంతోషం వ్య‌క్తం చేసింద‌న్నారు.

Recent

- Advertisment -spot_img