– మంత్రికి చిన్నారి రిక్వెస్ట్
– సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ‘కేటీఆర్ మామా.. హైదరాబాద్ కు డిస్నీ ల్యాండ్ తీసుకురా’ అంటూ ఓ చిన్నారి బుధవారం మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ (ఎక్స్)లో విజ్ఞప్తి చేసింది. ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘కేటీఆర్ మామా.. హైదరాబాద్కు డిస్నీ ల్యాండ్ తీసుకొని రా ప్లీజ్’ అంటూ ఓ చిన్నారి తన కోరికను తెలిపింది. ఈ వీడియోను ఆమె తండ్రి సురేంద్ర వినాయకం ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈ వీడియోపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘ప్రామిస్ చేయలేను కానీ బేటా.. తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తాను’ అంటూ సదరు చిన్నారికి రిప్లై ఇచ్చారు.