వికారాబాద్ జిల్లాలోని లగచర్ల గ్రామంలో కలెక్టర్ ప్రతీక్ జైన్ పై స్థానికులు దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్రరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయమై కేటీఆర్ నరేందర్ రెడ్డి కుటుంబాన్ని కలిశారు. జూబ్లీహిల్స్ లోని నివాసంలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి తల్లి, సతీమణి శృతి లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. అయితే కేటీఆర్ తో పటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి మరియు పలువురు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి నివాసానికి వెళ్లారు.