Homeహైదరాబాద్latest NewsKTR : ఆ యూట్యూబ్ చానళ్లపై పరువు నష్టం దావా వేస్తాం

KTR : ఆ యూట్యూబ్ చానళ్లపై పరువు నష్టం దావా వేస్తాం

  • కావాలనే మా మీద తప్పుడు ప్రచారం
  • అడ్డమైన థంబ్ నెయిల్స్ పెడుతున్నారు
  • గుడ్డి వ్యతిరేకత వల్లో.. డబ్బులకు అమ్ముడుపోయో తప్పుడు ప్రచారం
  • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: కొన్ని యూట్యూబ్ చానళ్లు తమ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. గుడ్డి వ్యతిరేకత వల్లో.. అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు అమ్ముడు పోయో తమ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన యూట్యూబ్ ఛానళ్లు కొన్ని, ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా, అసత్యాలను పదేపదే ప్రసారం చేస్తున్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా థంబ్‌నెయిల్స్ పెడుతూ, వార్తల పేరుతో శుద్ధ అబద్దాలను చూపిస్తున్నాయని మండిపడ్డారు. చట్టవిరుద్ధమైన వీడియోలను, ఫేక్ న్యూస్‌లను ప్రచారం చేస్తున్నాయని అన్నారు. ఇది వ్యక్తిగతంగా తనతోపాటు, బీఆర్‌ఎస్‌ పార్టీని దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే జరుగుతున్నదని భావిస్తున్నామని పేర్కొన్నారు. కేవలం ప్రజలను అయోమయానికి గురి చేసి, తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న చర్యగా భావిస్తున్నామని తెలిపారు.

Recent

- Advertisment -spot_img