HomeతెలంగాణKTR will be CM కేటీఆర్​ సీఎం అవుతారు

KTR will be CM కేటీఆర్​ సీఎం అవుతారు

– ప్రధాని మోడీ ఆశీర్వాదం అక్కర్లేదు
– మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి

ఇదేనిజం, హైదరాబాద్​: కేటీఆర్​ భవిష్యత్​లో కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి పేర్కొన్నారు. కేటీఆర్​ సీఎం కావాలంటే ప్రధాని మోడీ ఆశీర్వాదం అక్కర్లేదని చెప్పారు. కేటీఆర్‌ ఉన్నత చదువులు చదివిన గొప్ప విజన్‌ ఉన్న నాయకుడు అని పేర్కొన్నారు. ప్రజల్లో గొప్ప అభిమానాన్ని సంపాదించుకున్న నాయకుడు అని కొనియాడారు. కేటీఆర్‌ భవిష్యత్తులో తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని.. అందులో ఎవరికీ సందేహం లేదని వ్యాఖ్యానించారు. వారసత్వ రాజకీయాలకు అంకురార్పణ చేసిందే బీజేపీ పార్టీ అని గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఆరోపించారు. బీజేపీ నేతలు కుటుంబ పాలనపై మాట్లాడటం చాలా బాధాకరమని అన్నారు.

Recent

- Advertisment -spot_img