Homeతెలంగాణకేంద్ర మంత్రితో కేటీఆర్‌...

కేంద్ర మంత్రితో కేటీఆర్‌…

న్యూఢిల్లీ : తెలంగాణ ఐటీ, పట్టణాభివృద్ది శాఖ మంత్రి కేటీఆర్‌ కేంద్ర మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరిను ఢిల్లీలోని నిర్మన్ భవన్‌లో కలిశారు. రాష్ర్టంలో పట్టణాల అభివృద్ధి, ఐటీ శాఖ బలోపేతం, తెలంగాణలో పథకాల అమలుపై కేటీఆర్‌ కేంద్ర మంత్రితో చర్చించినట్లు సమాచారం. దీంతో పాటు అమృత్, ఎస్‌బీఎం, తదీతర పథకాల కింద రాష్ర్టానికి రావాల్సిన నిధుల విడుదల విషయమై ఆయన కేంద్ర మంత్రితో చర్చించినట్లు తెలుస్తుంది. అదే విధంగా ఉడాన్ పథకం కింద వరంగల్‌లో విమానాశ్రయ నిర్మాణానికి సంబందించిన పనుల వివరాలు చర్చించారు. మంత్రి కేటీఆర్​తో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక వైస్ చైర్మన్ వినోద్ కుమార్ ఉన్నారు.

Recent

- Advertisment -spot_img