Homeహైదరాబాద్latest Newsతెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్'.. కేటీఆర్ పిలుపు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 29న ‘దీక్షా దివస్’.. కేటీఆర్ పిలుపు

ఈనెల 29వ తేదీన కరీంనగర్‌లో దీక్ష దివస్ కార్యక్రమం నిర్వహించనున్నం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్ష దివస్‌ను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర సాధనలో అత్యంత కీలకమైన ఘట్టంగా దీక్ష దివస్ నిలుస్తుంది అని పేర్కొన్నారు. 2009 నవంబర్ 29వ తేదీన భారత రాష్ట్ర సమితి (అప్పటి టీఆర్ఎస్) అధ్యక్షులు కేసీఆర్ గారు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి, స్వరాష్ట్ర సాధనకు బలమైన పునాదులు వేసింది అని తెలిపారు. దీక్షకు వెళ్లే ముందు “తెలంగాణ వచ్చుడో – కేసీఆర్ సచ్చుడో” అనే తెగింపుతో చేపట్టిన ఈ దీక్ష సబ్బండ వర్గాల తెలంగాణ ప్రజలను ఏకం చేసింది అని కేటీఆర్ అన్నారు. సమగ్ర భారత దేశ రాజకీయ వ్యవస్థను కదిలించి, దశాబ్దాల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చింది అని కేటీఆర్ తెలిపారు.

Recent

- Advertisment -spot_img