మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువునష్టం దావా వేశారు. ఈ మేరకు నాంపల్లి ప్రత్యేక కోర్టులో కేటీఆర్ తరపున అయన న్యాయవాది ఉమామహేశ్వరరావు పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్‌ఎస్ నేతలు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్‌లను ఈ పిటిషన్‌లో సాక్షులుగా పేర్కొన్నారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇటీవలే కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ సినీ పరిశ్రమలోని పలువురిని ప్రస్తావిస్తూ కేటీఆర్ పై ఆరోపణలు చేశారు.కొండా సురేఖపై ఇప్పటికే ప్రముఖ సినీనటుడు నాగార్జున క్రిమినల్ పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా మంత్రి కేటీఆర్ కూడా పరువునష్టం దావా వేశారు.