NDA 3.0 ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సెటైర్ వేశారు. గత పదేళ్లుగా తెలంగాణకు ఏమిస్తున్నారో, ఈసారి కూడా అదే ఇచ్చారని అన్నారు. రాష్ట్రానికి పెద్ద గుండు సున్నా అని వ్యంగ్యంగా మాట్లాడారు. కాగా, ఈసారి తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు లేవు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.