Lady Aghori Marriage: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వర్షిణీ అనే యువతిని “లేడీ అఘోరీ” అలియాస్ శ్రీనివాస్ పెళ్లి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. నందిగామలో లేడీ అఘోరీ వివస్త్రంగా ఉండగా వర్షిణీ ఆమెకు దుస్తులు అందించడంతో వారి పరిచయం ప్రేమగా మారింది. గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని ఆలయాల్లో ఈ జంట పెళ్లి జరుపుకున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. అయితే, వర్షిణీ తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ఆమెను ఇంటికి తీసుకొచ్చినప్పటికీ, ఆమె మళ్లీ అఘోరీ వద్దకు వెళ్లిపోయింది. ఇదిలా ఉంటే, మరో యువతి లేడీ అఘోరీ తనను జనవరి 1న పెళ్లి చేసుకున్నాడని, వర్షిణీతో రెండో పెళ్లి చట్టవిరుద్ధమని ఆరోపిస్తూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసులను చర్యలు తీసుకోవాలని కోరుతోంది.