బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలు మాఫీ చేయిస్తానని ఓ వ్యక్తి కొంతమంది నుంచి లక్షలు దోచుకున్నాడు. ఈ ఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వన్ టౌ సీఐ రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం… రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్‌కు చెందిన బంగారు అప్పారావు లగ్జరీకారుతో తిరుగుతూ.. డాక్టర్లతో పరిచయం పెంచుకున్నాడు. ప్రముఖుల సిఫారసుతో లోన్లు మాఫీ చేయించొచ్చని వారి నుంచి లక్షల్లో డబ్బు తీసుకుని రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టాడు. విషయం తెలుసుకున్న డాక్టర్లు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.