ఇదే నిజం, జుక్కల్: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం పెద్ద ఎక్లరా గ్రామం లో శనివారం పద్మశాలి సంఘం సభ్యుల ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు జరిగాయి.కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశాలి ముద్దుబిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఆయన చేసిన నిస్వార్థ సేవను కొనియాడారు.తెలంగాణ ఉద్యమంలో తాను ముందుండి తెలంగాణ ప్రజలను నడిపించారని, ఆయన కలలుగన్న తెలంగాణను భావితరాలు తెలంగాణ ప్రజలను నడిపించారని, ఆయన కలలుగన్న తెలంగాణను భావితరాలు గుర్తుంచుకొని ముందుకు నడిపించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మెరిగేవార్ శ్రీనివాస్, కిషన్ మరియు పోశెట్టి లక్ష్మణ్ బాలాజీ రాములు పాల్గొన్నారు.