నందమూరి తారకరామారావు సతీమణి లక్ష్మీపార్వతి ఏపీ తెలుగు అకాడమి చైర్పర్సన్ పదవికి రాజీనామా చేశారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ లక్ష్మీపార్వతిని తెలుగు అకాడమీ చైర్మన్‌ను చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రావడంతో తన పదవికి రాజీనామా చేసి, రాజీనామా లేఖను ప్రభుత్వానికి పంపారు. ఇదే విధంగా గత ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు పొందిన నేతలు కూడా రాజీనామాలు చేస్తున్నారు.