టాలీవుడ్ నటి రాయ్ లక్ష్మికి ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌లో సినిమా చిత్రీకరణ సమయంలో ఒక్కసారిగా కిందపడిపోయింది. దీంతో ఆమె కాలికి గాయమైంది. ఈ ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
లక్ష్మీ రాయ్.. పేరు మార్చుకుని రాయ్ లక్ష్మీ అయిపోయింది. పేరు మార్చుకున్న తర్వాత బాలీవుడ్ లోనూ బిజీ అయిపోయింది. అక్కడ కూడా సినిమాలు చేసింది. జూలీ 2 లాంటి సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చింది. అందాలనే ఆయుధంగా చేసుకుని వరస అవకాశాలు అందుకుంటుంది లక్ష్మీ రాయ్.
తెలుగులో బాలకృష్ణ అధినాయకుడు లాంటి సినిమాలలో హీరోయిన్‌గానూ నటించింది. కానీ ఈమెకు టైమ్ కలిసిరాలేదంతే. దీంతో ఐటం క్వీన్‌గా మారిపోయింది.
చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో నటించింది లక్ష్మీ రాయ్. బలుపు, సర్ధార్ గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150 సినిమాల్లోనూ ఐటం సాంగ్స్ చేసి ఫుల్ బిజీ అయిపోయింది.
సినిమాలు చేసినా చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం బిజీగా ఉంటుంది రాయ్ లక్ష్మి. హాట్ పోటోషూట్స్ చేసుకుంటూ పిచ్చెక్కిస్తుంది లక్ష్మీ.
ఇదిలా ఉంటే షూటింగ్ లో భాగంగా ఈమెకు యాక్సిడెంట్ అయింది. ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌లోనే ఉంది రాయ్ లక్ష్మి.
మార్చి 20 అర్ధరాత్రి బంజారాహిల్స్‌లో 2 గంటల సమయంలో షూటింగ్ చేస్తుండగా అనుకోని ప్రమాదం జరిగింది.
ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో రాయ్ లక్ష్మీకి గాయాలైనట్లు తెలుస్తుంది. కాలికి బలమైన గాయమే అయింది. ఈ ఫొటోలను కూడా పోస్ట్ చేసింది ఈ భామ.
యాక్షన్ సీక్వెన్స్‌లు చిత్రీకరిస్తున్న సమయంలో ఉన్నట్లుండి ఒక్కసారిగా కింద పడిపోయింది. దీంతో పక్కనే ఉన్న వాళ్లంతా కేకలు వేస్తూ ఆమెను పైకి లేపారు.
అయితే అప్పటికే ఈమె కాలికి భారీ గాయమే అయ్యింది. షూటింగ్ వెంటనే ప్యాకప్ చెప్పేసి లక్ష్మీని ఆస్పత్రికి తరలించారు.
ఈ ఫోటోలను పోస్ట్ చేసింది రాయ్ లక్ష్మి. యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేసినందుకు తనకు లభించిన రిటర్న్ గిఫ్ట్ ఇది అంటూ పోస్ట్ చేసింది. ‘క్వీన్ ఆఫ్ ఇంజురీస్’ అనే క్యాప్షన్ కూడా రాసింది. గతంలోనూ ఆమెకు పలుమార్లు ఇలానే గాయాలు అయ్యాయని గుర్తు చేసింది.
Read this news also…
- అన్నమోదిక్కు… ఆకలోదిక్కు…!!
- క్లాక్ టవర్ల చరిత్ర తెలుసా.. వీటి వెనుక స్వార్థం ఏంటి..
- ఢిల్లీ ప్రభుత్వ అధికారాల కత్తెరకు లోక్‌సభ ఆమోదం
- గుండె ఆరోగ్యానికి పంచ సూత్రాలు
- భోజనం తర్వాత బెల్లం ముక్క తింటే ఎన్ని లభాలో తెలుసా
- డైటింగ్ అంటే మానేయడం కాదు.. ఇలా కూడా బరువు తగ్గొచ్చు..
- వేగంగా తింటే ఇక అంతే… నెమ్మదిగా తింటేనే ఆరోగ్యం…
- అన్నం తినడం వలన డయాబెటిస్‌కు గురయ్యే ప్రమాదం ఉందా
- కరోనా దెబ్బకు ఏకంగా 71 లక్షల ఈపీఎఫ్ ఖాతాలు మూత
- ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి పీఆర్సీ