Homeక్రైంLalu gets relief in land scam case భూ కుంభకోణం కేసులో లాలూకు ఊరట

Lalu gets relief in land scam case భూ కుంభకోణం కేసులో లాలూకు ఊరట

– బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ కోర్టు

ఇదేనిజం, నేషనల్​ బ్యూరో: భూ కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్​ యాదవ్​కు స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు ఊరట లభించింది. భూ కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత, బిహార్‌ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు ఢిల్లీ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఇదే కేసులో ఆయన సతీమణి రబ్రీదేవి , ఆయన కుమారుడు, బిహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌, కుమార్తె, ఆర్జేడీ ఎంపీ మీసా భారతీ లకు కూడా బెయిల్‌ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లాలూ కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో రైల్వేలో ఉద్యోగాలు ఇప్పించేందుకు కొందరు అభ్యర్థుల నుంచి భూములు తీసుకున్నారన్న అభియోగాలపై ఆయనతోపాటు మరో 15 మందిపై గతేడాది మే 18న సీబీఐ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. అదే ఏడాది అక్టోబరులో తొలి ఛార్జీషీట్‌ను దాఖలు చేయగా, ఈ ఏడాది జులై 3న మరో ఛార్జ్‌షీట్‌ను సమర్పించింది.

Recent

- Advertisment -spot_img