Homeజాతీయంlalu prasad yadav: ఓడిపోయాక విదేశాలకు మోడీ..

lalu prasad yadav: ఓడిపోయాక విదేశాలకు మోడీ..

  • అనువైన ప్రదేశాల కోసం అన్వేషణ
  • ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్

ఇదేనిజం, నేషనల్ బ్యూరో: ప్రధాని మోడీ ఓడిపోయాక విదేశాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ విమర్శించారు. విదేశాల్లో స్థిర‌ప‌డేందుకు అనువైన ప్ర‌దేశాల‌ను వెతుకుతున్నార‌ని ఎద్దేవా చేశారు. విప‌క్షాల ఇండియా కూటమిపై ప్రధాని మోడీ విమర్శలు చేసిన నేపథ్యంలో లాలూ ఈ వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల క్రితం ఇండియా కూటమి ఏర్పాటుపై ప్రధాని మాట్లాడుతూ.. అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాల కోసమే ప్రతిపక్షాలు కొత్త కూటమిని ఏర్పాటు చేశాయని ఆరోపించిన విషయం తెలిసిందే. మోడీ వ్యాఖ్య‌ల‌కు లాలూ సెటైర్ వేశారు. పిజ్జాలు, మోమోల‌ను ఆస్వాదిస్తూ మోడీ విదేశాల్లోనే విశ్రాంతి తీసుకుంటార‌ని లాలూ తెలిపారు. నెల రోజుల్లో ముంబైలో జ‌రిగే ఇండియా కూట‌మి సమావేశానికి బీహార్ సీఎం నితీశ్ కుమార్‌తో క‌లిసి హాజ‌ర‌వ్వ‌నున్న‌ట్టు లాలూ చెప్పారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img