తెలంగాణలో త్వరలో భూముల ధరలు పెంచబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. త్వరలో భూసర్వే కోసం ప్రతీ మండలానికి సర్వేయర్, డిప్యూటీ సర్వేయర్ ను నియమిస్తాం. 6 వేల మంది లైసెన్డ్ సర్వేయర్ లకు అవకాశం ఇస్తాం. వీరికి ట్రైనింగ్ ఇస్తాం. సాదాబైనామల విషయంలో కొత్త దరఖాస్తులను స్వీకరించం. పాత దరఖాస్తులలో 13 లక్షల దరఖాస్తులను గత ప్రభుత్వం రిజక్ట్ చేసింది. రిజెక్ట్ చేసిన వాటిని అప్పీలేట్ అధారిటిలో దరఖాస్తు చేసుకోవచ్చు’ అని చెప్పారు.