Homeహైదరాబాద్latest Newsభూ కుంభకోణం.. హైకోర్టును ఆశ్రయించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య..!

భూ కుంభకోణం.. హైకోర్టును ఆశ్రయించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య..!

కర్ణాటక రాజకీయాల్లో మైసూరు నగరాభివృద్ధి సంస్థ కుంభకోణం కలకలం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో తనను విచారించేందుకు గవర్నర్ థావర్చంద్ గహ్లోత్ అనుమతి మంజూరుచేయడాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గవర్నర్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సోమవారం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. కాగా గవర్నర్ నిర్ణయం నేపథ్యంలో సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.

Recent

- Advertisment -spot_img