గ్రూప్ 2 అభ్యర్థులకు టీజీపీఎస్సీ ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. దరఖాస్తులో ఏవైనా తప్పులుంటే సవరించుకోవాల్సిందిగా సూచించింది. జూన్ 16న ఉదయం 10 గంటల నుంచి జూన్ 20 సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఎడిట్‌కు ఇదే చివరి అవకాశం అని, మరో ఛాన్స్ ఇవ్వబోమని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ, ఆధార్ కార్డు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దరఖాస్తుల ఎడిట్ పూర్తైన తర్వాత తప్పనిసరిగా పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందిగా సూచించింది. ఇక గ్రూప్ 2 పరీక్షను ఆగస్టు 7, 8 తేదీల్లో నిర్వహించనున్నట్లు కమిషన్ తెలిపింది.