మహా నటుడు యన్టీర్, అంజలి దేవి నటించిన లవకుశ చిత్రం చూడని తెలుగువారు వుండరు. ఆ చిత్రంలో లవకుశులుగా అలరించిన బాల నటులుగా సుబ్రహ్మణ్యం, నాగరాజులు నటించారు. వీరిలో కుశుడుగా నటించిన అనపర్తి నాగరాజు ఈ రోజు ఉదయం కన్నుమూశారు. 71 సంవత్సరాల నాగరాజు గుండెపోటుతో హైదరాబాద్ లోని గాంధీ నగర్ లో తన స్వగృహం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య ముగ్గురు కుమార్తెలు. లవకుశ చిత్రం ద్వారా బాల నటుడిగా వెండితెరకు పరిచమయ్యారు. ఇప్పటివరకు తెలుగు తమిళం భాషల్లో 340కు పైగా చిత్రాల్లో నటించారు. యన్టీర్ పౌరాణిక చిత్రాల్లో షుమారు 22 చిత్రాల్లో వివిధ పౌరాణిక పాత్రల్లో నటించారు.
ఈ సందర్భంగా తెలుగు టి వి రచయితల సంఘం అధ్యక్షులు డి సురేష్ కుమార్, మరియు సంఘ సభ్యులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, అయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తూ తమ సంతాపాన్ని తెలియచేసారు.
‘లవకుశ’ నాగరాజు ఇక లేరు
RELATED ARTICLES