ఇదే నిజం, గొల్లపల్లి: విశ్వహిందూ పరిషత్ &బజరంగ్ దళ్ గొల్లపెల్లి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి లడ్డు కల్తీ జరగదాన్ని నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ నాయకులు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం యావత్ భారతదేశంలోనే పేరు పొందిన పుణ్యక్షేత్రం యొక్క ప్రసాదంలో కల్తీ జరగడం అభాగ్యకరమని ఇకముందు ఇలా జరుగుతే ఊరుకునేది లేదని యావత్తు భారత ప్రజలు క్షమించబోరని తెలిపారు.జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయo ఎదుట జరిగిన నిరసన కార్యక్రమంలో గొల్లపెల్లి మండల విశ్వహిందూ పరిషత్,బజరంగ్ దళ్ నాయకులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గోరక్ష్ ప్రముఖ్ ఆడెపు నరేష్ ,వి.హెచ్.పి మండల అధ్యక్షులు కుంభకార్ అరుణ్,భజరంగ్ దళ్ మండల కన్వీనర్ ఎనగందుల రమేష్,బజరంగ్ దళ్ కో కన్వీనర్ భీమ జలపతి,వి.హెచ్.పి.ప్రధాన కార్యదర్శి ఆవుల వెంకటేష్ యాదవ్,గొల్లపెల్లి మండల అధ్యక్షులు కట్ట మహేష్,బీజేవైఎం అధ్యక్షులు లక్కాకుల వెంకటేష్,సంగెం కళ్యాణ్,మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.