Homeహైదరాబాద్latest Newsబీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు లీగల్ నోటీసులు

బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు లీగల్ నోటీసులు

మూసీ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీకి సంబంధించి నిరాధార ఆరోపణలు చేసినందుకు సింగపూర్‌కు చెందిన మెయిన్ హార్డ్స్ సంస్థ బీఆర్‌ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్‌కు లీగల్ నోటీసులు పంపింది. తమ కంపెనీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు క్రిశాంక్ దురుద్దేశంతో ఆరోపణలు చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు. తమపై చేసిన ఆరోపణలను 24 గంటల్లో ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సివిల్‌, క్రిమినల్‌ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Recent

- Advertisment -spot_img