Lenin Title Glimpse: అక్కినేని అఖిల్ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఒక ప్రత్యేకమైన బహుమతిని అందించారు. ఆయన కొత్త సినిమా ‘లెనిన్’ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్‌లో అఖిల్ ఊర మాస్ లుక్‌లో దర్శనమిచ్చారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ప్రేమ కథకు యాక్షన్ జోడించి ‘లెనిన్’ మూవీని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ గ్లింప్స్‌లో అఖిల్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ గ్లింప్స్ చూస్తుంటే ఇది రూరల్ లవ్ డ్రామాగా రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ గ్లింప్స్ చూస్తుంటే.. ఈ సారి అఖిల్ పక్క హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. ఈ సినిమాను దసరా బరిలో విడుదల చేసే అవకాశం ఉంది.