Homeసినిమా'Leo'..record bookings in US ‘లియో’..యూఎస్​లో రికార్డ్ బుకింగ్స్

‘Leo’..record bookings in US ‘లియో’..యూఎస్​లో రికార్డ్ బుకింగ్స్

ఇదేనిజం : ఇళయ దళపతి విజయ్ హీరోగా త్రిష హీరోయిన్ గా కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ డ్రామా “లియో” కోసం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాపై ఉన్న హైప్ అయితే తమిళ్ నుంచి రీసెంట్ టైం లో ఏ చిత్రానికి కూడా రాలేదని చెప్పడంలో డౌట్ లేదు. ఇప్పటికే ఓవర్సీస్ మార్కెట్ లో రికార్డు బుకింగ్స్ నమోదు చేస్తున్న ఈ చిత్రం ఇప్పుడు యూఎస్ లో అయితే సెన్సేషనల్ నంబర్స్ ని నమోదు చేస్తుంది. ఇంకా ట్రైలర్ లాంటిది కూడా ఏమి రాకుండా అక్కడ ఏకంగా ఇప్పుడు 3 లక్షల 50 వేల డాలర్స్ ని దాటేసింది. దీనితో లియో పై ఉన్న అంచనాలు ఏ లెవెల్లో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఇక ట్రైలర్ వచ్చాక సినిమా రిలీజ్ దగ్గరకి వచ్చేసరికి మరింత స్థాయిలో ప్రీమియర్స్ నంబర్స్ నమోదు కావచ్చని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో సంజయ్ దత్, అర్జున్ సార్జా తదితరులు కీలక పాత్రల్లో నటించగా అనిరుద్ సంగీతం అందించాడు అలాగే 7 స్క్రీన్ స్టూడియోస్ వారు నిర్మాణం వహించారు

Recent

- Advertisment -spot_img