Homeహైదరాబాద్latest Newsశ్రీశైలంలో పూజారి ఇంట్లో చిరుత పులి కలకలం

శ్రీశైలంలో పూజారి ఇంట్లో చిరుత పులి కలకలం

శ్రీశైలంలోని ఓ పూజారి ఇంట్లో చిరుతపులి సంచరించి కలకలం సృష్టించింది. పాతాళగంగ మెట్లపై ఉన్న శ్రీశైలంలో పూజారి సత్యనారాయణ ఇంట్లో అర్ధరాత్రి చిరుతపులి సంచరించింది. రాత్రి చిరుత ఇంట్లోకి వచ్చినట్లు సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలను ఉదయాన్నే చూసిన పూజారి కుటుంబం షాక్కు గురైంది.దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వీడియో వైరల్‌గా మారింది. కొద్ది నెలలుగా శ్రీశైలం పరిసరాల్లో చిరుతపులి సంచరిస్తోందని స్థానికులు తెలిపారు. అటవీ శాఖ అధికారులు తగు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో స్థానికులు రాత్రిపూట బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు.

Recent

- Advertisment -spot_img