ఇదేనిజం – మదర్ తెరిస్సా జయంతి సందర్బంగా దమ్మాయిగూడలో పూల మాలలు వేసి అందరికి మిఠాయిలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమములో మథర్ తెరిస్సా ఆర్గనైజేషన్ చైర్మన్ గాలి సంపత్ కుమార్ మాట్లాడుతూ మథర్ తెరిస్సా ఆశయాలకు అనుగుణంగా వారి అడుగు జాడల్లో నడవాలని ఏమి లేని ఆనాధలను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. గత 2008 వ సంవత్సరం నుండి మాకు తోచిన సహాయాన్ని ఏమి లేని నిరుపేదలకు, అభాగ్యులకు.. మథర్ తెరిస్సా ఆర్గనైజేషన్ నుండి. మా సభ్యులందరి సహకారముతో.. సేవ కార్యక్రమాలు చేపడుతూ మాకు తోచిన సహాయాన్ని అందచేయడం జరుగుతుంది, మీలో ఎవరైనా సహాయం చేయదలచిన వారు.9700820822 నెంబర్కు కాల్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమములో వైస్ ప్రెసిడెంట్ వెన్న రాము, పద్మారావు, ట్రేజరర్ మామిండ్ల అనిల్ కుమార్, సెక్రెటరీ పద్మావతి, జాయింట్ సెక్రెటరీ స్వప్న, శాంతి, రాణి, గిరీష్ తంగెడ, మహర్షి డాక్టర్, పాండాల పరమేష్ గౌడ్, కుతాడి కుమార్, పడిగె భాస్కర్, గుండ్లపల్లి వెంకటేష్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.