ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు అలాగే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులకు ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సీఐ సదన్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలో జూనియర్ కాలేజ్ నుండి తెలంగాణ తల్లి విగ్రహం వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో 200 మందికి పైగా పాల్గొన్నారు. యువతలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వ్యసనంపై అవగాహన కల్పించి ఆంటీ డ్రగ్స్ నిర్మూలనపై విద్యార్థులచే ప్రతిజ్ఞ నిర్వహించిన్నారు ఈ సందర్భంగా సిఐ సదన్ కుమార్ మాట్లాడుతూ మత్తు మాదక ద్రవ్యాల గంజాయి వంటి పదార్థాలు నిర్మూలించాలంటే పూర్తి బాధ్యత యువత మీదనే ఉందని ఈ మత్తుమందు యువత ప్రాణాలు తీస్తుంది పిచ్చోళ్లను చేస్తుంది చెడు దారుణ పట్టిస్తుంది మత్తు పదార్థాలకు గంజాయికి దూరంగా ఉండండి సాగులో ఉండొద్దు రవాణా చెయ్యొద్దు దాన్ని నిర్మూలించి మత్తు రహిత జిల్లాగా తీర్చిదిద్దుకుందామని సీఐ సదన్ కుమార్ విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఏ ఎస్ ఐ వెంకటరమణ. దామోదర్. కుమార్. సంతోష్. హోంగార్డ్ మనోహర్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.