Homeహైదరాబాద్latest Newsడ్రగ్స్ మహమ్మారిని తరిమేద్దాం.. డ్రగ్స్ రహిత సమాజాన్ని భావితరాలకు అందిద్దాం

డ్రగ్స్ మహమ్మారిని తరిమేద్దాం.. డ్రగ్స్ రహిత సమాజాన్ని భావితరాలకు అందిద్దాం

ఇదే నిజం, చింతల మనేపల్లి: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా చింతలమానెపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నీ కస్తూర్బా గాంధీ బాలికల స్కూల్ నందు మారకద్రవ్యాల నిర్మూలన పై అవగాహన కార్య క్రమం విద్యార్థులతో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై నరేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేస్తామని,పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు గమనిస్తూ ఉండాలని తెలిపారు. యువత ఎంతో మంచి భవిష్యత్తు కలిగి ఉండవలసిన వారు కొంతమంది చెడు మార్గాల వైపు ఆకర్షితులవుతున్నారని మత్తుకు అలవాటు పడి గంజాయి అలవాటు చేసుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారని వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

గంజాయి ఇతర మత్తు పదార్థాలు సేవించేవారు వారి మానసిక స్థితిని కోల్పోయి నేరాలు చేసే అవకాశం ఉంటుందన్నారు. గ్రామాలలో పట్టణాలలో యువతి యువకులు మంచి అలవాట్లతో తల్లిదండ్రులు మరియు గురువుల చెప్పిన మాటలు విని చదువుతూ ముందుకు వెళితే చక్కని భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. మారకద్రవ్యాల విషయములో ఎంత పెద్ద వారు ఉన్న ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మాదకద్రవ్యాల అలవాట్ల వల్ల కలిగే దుష్పరిణామాల పై విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించి బహుమతులను అందజేయడం జరిగింది.

Recent

- Advertisment -spot_img