ఇదే నిజం, దేవరకొండ: కొండ మల్లేపల్లి మండల కేంద్రంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్చదనం పచ్చదన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణంలో హెల్త్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై, పార్టీ శ్రేణులు మరియు అధికారులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే ని వైద్య అధికారులు శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెసు పార్టీ మండల అధ్యక్షులు ఉట్కూరి వెమన్ రెడ్డి, పిఏసిఎస్ చైర్మన్ దూదిపాల వేనుదర్ రెడ్డి, దూదిపాల శ్రీధర్ రెడ్డి, నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, సీనియర్ నాయకులు నాయిని మాధవ రెడ్డి, మాజి వైస్ ఎంపీపి వేంకటేశ్వర్లు, మాజి జెడ్పీటీసీ సలహాదారు పసునూరి యుగంధర్ రెడ్డి, మాజి సర్పంచ్ కుంభం శ్రీనివాస్ గౌడ్, మాజి ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్ర రాంసింగ్ నాయక్, నియోజక వర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ, మాజి ఎంపీటీసి రాణి రాజు నాయక్, లాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.