ఇదే నిజం ,ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి పట్టణంలోని స్థానిక మైనార్టీ స్కూల్ ని మంగళవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా స్కూల్ లో విద్య బోధన,మాలిక వసతులు,మధ్యాహ్న భోజనం, టాయిలెట్స్ వంటి తదితర అంశాలను స్కూల్ యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ధర్మపురి పట్టణంలోని స్థానిక మైనార్టీ స్కూల్లో విద్యార్థుల వసతుల గురించి తెలుసుకోవడానికి స్కూల్ కి రావడం జరిగిందని, నియోజకవర్గంలో పక్క భవనాలు లేని స్కూల్స్ కి పక్క భవనాలు నిర్మింపజేయడంలో తన వంతు కృషి చేస్తానని, గత ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన కొప్పుల ఈశ్వర్ ఎందుకని పక్క భవనాలు నిర్మించలేదని, ధర్మపురిని ఒక సరస్వతి నిలయంగా తీర్చిదిద్దుతామని, నియోజక వర్గంలో విద్య పరంగా ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని, స్వయంగ నేనే పాఠశాలను తనిఖీ చేస్తానని, విద్యకు సంబంధించిన విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తి లేదని, రాష్ట్ర ప్రభుత్వం విద్య రంగానికి పెద్ద పీట వేయడం జరిగిందనీ ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం,ఉపాధ్యాయులు,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంఘనభట్ల దినేష్, వేముల రాజేష్ ,ఆసెట్టి శీను ,జక్కు రవి, సింహరాజు ప్రసాద్ ,చీపిరి శెట్టి రాజేష్ ,యు లక్ష్మణ్, గాజు సాగర్, గుడ్ల రవి ,రమణ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.