Homeహైదరాబాద్latest Newsప్రమాదాల నుండి రక్షించుకుందాం.. భద్రత సూచనలు కచ్చితంగా పాటిద్దాం

ప్రమాదాల నుండి రక్షించుకుందాం.. భద్రత సూచనలు కచ్చితంగా పాటిద్దాం

ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల్ జిల్లా గొల్లపల్లి మండలంలోని వ్యవసాయ మార్కెట్లో విద్యుత్ ప్రమాదాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎడి వరుణ్ మాట్లాడుతూ విద్యుత్ ప్రమాణాలు జరిగినప్పుడు మనకెంతో ఆందోళన మరియు ఆవేదనను కలిగిస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలోనూ ఈదురుగాలుల వల్లను, ప్రకృతి వైపరీత్యాల వల్ల తీగలు తెగిపోవడం, సాగడం, స్తంభాలు విరగడం, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, ఎర్తింగ్ విఫలం కావడం, తదితర లోపాలు ఏర్పడి అజాగ్రత్తతో వ్యవహరించిన, వినియోగదారులు విద్యుత్ ప్రమాదాలకు లోనవుతరని అన్నారు.

గ్రామీణ ప్రాంత వినియోగదారులకు భద్రత సూచనలు.

  • రైతు సోదరులు తమ వ్యవసాయ అవసరాల నిమిత్తం వ్యవసాయం పంపుసెట్లను వినియోగించినప్పుడు కరెంటు మోటార్లు గాని, పైపులు గాని, ఫుట్ వాల్యూలను కానీ ఏమరుపాటుతో తాకకూడదు. పొరపాటున కరెంటు ప్రసారం జరిగే ప్రమాదం సంబంధించిన అవకాశం ఎక్కువగా ఉంటుంది.
  • వర్షాలు కుడిచినప్పుడు విద్యుత్ స్తంభాలను, తెగిపడిన తీగలను, స్టాటర్లను, మోటార్లను తాకరాదు. వేలాడుతున్న కరెంటు తీగల గురించి లైన్లకు చెట్ల కొమ్మలు, తాకి మంటలు లేస్తే అధికారులకు తెలుపాలి. తీగలు లూజుగా ఉంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అందువలన దగ్గరలో ఉన్న కరెంట్ ఆఫీసర్ కు మరియు సంబంధిత అధికారులకు తెలియజేయండి.
    * సర్వీస్ వైర్లను, వీధిదీపాలను సరి చేసేందుకు ఇతరులు విద్యుత్ స్తంభాలను ఎక్కరాదు, సంస్థ సిబ్బంది సహాయం కోరడం తప్పనిసరిగా పాటించాలి.
    * ఇంటి వరండాలో మరియు ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ కు దగ్గరలో జి ఐ వైరును దండముగా కట్టి తడి బట్టలను ఆరవేయడం ప్రమాదకరం.
  • ఎవరైనా కరెంట్ షాక్ సంభవిస్తే దగ్గరలోని వ్యక్తులు షాక్ కు గురైన వ్యక్తిని రక్షించాలన్న ఆతృతతో ప్రమాదం సంభవించిన వ్యక్తిని ముట్టుకోరాదు. షాక్ కు గురైన వ్యక్తిని వేరు చేయడానికి విద్యుత్ ప్రవహించని వస్తువులను వాడటమే సరైయైన పరిష్కారం.

విద్యుత్ ను ఆదా చేయుటకు వినియోగదారులకు కొన్ని సూచనలు

  • సాధారణ ఉండని ఫిలమెంట్ బల్బులకు బదులుగా ఎల్.ఈ.డి బల్బులను వాడండి.
  • గదిలో ఎవరి లేనప్పుడు ఫ్యాన్లను, లైట్లను ఆర్పివేయండి.
  • అవసరమైనప్పుడు మాత్రమే విద్యుత్తును వాడండి.
  • విద్యుత్ కుక్కర్ లకు బదులుగా ప్రెషర్ కుక్కర్ లను వాడండి.
  • ఎయిర్ కండిషనర్ ను 25 డిగ్రీల సెంటీగ్రేట్ కు అమర్చుకొని అరగంట తర్వాత ఆఫ్ చేయగలరు.
  • ఏసి ఫిల్టర్లను నెలకు ఒకసారి శుభ్రపరుచుకోగలరు.
  • తడిసిన బట్టలను ఐరన్ చేయకండి.ఐ.ఎస్.ఐ బ్రాండెడ్ ఐరన్ బాక్స్ లను వాడండి.
  • సరైన వెలుతురు గాలి వచ్చే విధంగా ఇండ్లను నిర్మించుకోగలరు. దీని వలన పగలు విద్యుత్ అవసరం ఉండదు.
  • ఎలక్ట్రికల్ వాటర్ హీటర్ మరియు ఎలక్ట్రికల్ గ్రీజర్లకు బదులుగా సోలార్ వాటర్ హీటర్లను వాడండి.

ఈ కార్యక్రమంలో ఏడి వరుణ్, ఏఈ దివాకర్, ఎస్ బి రాజు,దామోదర్, ఎస్ఎల్ఐ రమణ, ఎల్ఐ రాజు, ఎల్ఎం కుమార్, జేఎల్ఎం కుమార్, చంద్రశేఖర్, పుప్పాల మహిపాల్, సిరికొండ తిరుపతి, కరాబార్ మహేష్, శీను తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img