Homeహైదరాబాద్latest Newsమట్టి వినాయకులను పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం: ఎమ్మెల్యే ఆరెక పూడి గాంధీ

మట్టి వినాయకులను పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం: ఎమ్మెల్యే ఆరెక పూడి గాంధీ

ఇదేనిజం, శేరిలింగంపల్లి: మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెక పూడి గాంధీ పిలుపునిచ్చారు. మంగళవారం వినాయకచవితిని పురస్కరించుకుని హాఫ్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని వివేకానంద నగర్ లోని ఎమ్మెల్యే కార్యలయంలో ప్రారంభించి ప్రజలకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ..హోప్ ఫౌండేషన్ ఆద్వర్యంలో మట్టి వినాయకుల ప్రతిమలు పంపీణీ చేయడం చాలా అభినందనీయమన్నారు. గత 9 సంవత్సారాలుగా హోప్ ఫౌండేషన్ ఆద్వర్యంలో మట్టి వినాయకుల పంపీణీ చేపడుతూ పర్యావరణ పరిరక్షణ విషయంలో తమదైన పాత్ర పోషించడం పట్ల ఫౌండేషన్ చైర్మెన్ కొండ విజయ్ కుమార్ ను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినదించారు. కొండ విజయ్ మాట్లాడుతూ.. తమ ఫౌండేషన్ ఆద్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం 5 వేల మట్టి ప్రతిమలను పంపీణీ చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్, శర్మ ,మల్లయ్య, రాజు,స్వరూప, కమలమ్మ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img